వూబకాయం పిల్లలను ఎక్కువగా వేధించే సమస్య. అందుకే ముందు జాగ్రత్తలివిగో...
* సూర్యోదయానికి ముందే నిద్ర లేపి వాకింగ్‌కు తీసుకెళ్లాలి. సాయంత్రం ఈత, నృత్యం లాంటి వాటిలో శిక్షణ ఇప్పించాలి.
* ఇంట్లో ఫ్రిజ్‌ను ఎప్పుడూ పండ్లు, బలమైన ఆహార పదార్థాలతో నింపాలి. నూనెతో చేసిన స్నాక్స్ జోలికి వెళ్లనివ్వద్దు. టీవీ, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోనివ్వద్దు.
* చాక్లెట్లు, బంళాదుంప చిప్స్, ఐస్‌క్రీంలు, కేక్‌లు, శీతలపానీయాల జోలికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లనివ్వద్దు.
* వంట చేసేప్పుడు వారి సహకారం తీసుకోవాలి. దీనివల్ల వారి శరీరంలోని కెలొరీలు ఖర్చవుతాయి. పని అలవడుతుంది.
Comments
Post a Comment