Skip to main content

Posts

Showing posts with the label fast -weight-loss-tips

Tips for good Health

మారాలంటే మల్ల్లెతీగలా! ''వధువంటే... చెక్కిన శిల్పంలా సన్నగా కనిపించాలి. అందుకోసం ఇప్పటి నుంచే డైటింగ్‌ చేయడం మొదలుపెట్టు. ఆ తర్వాత లావైనా పరవాలేదు..' అంటూ కాబోయే పెళ్లి కుమార్తెకు రకరకాల సలహాలిస్తుంటారు ప్రతి ఒక్కరూ. కేవలం ఆటపట్టించేందుకు అన్నా కూడా... ఈ మధ్య ఇలాంటివారు ఎక్కువగా కనిపిస్తున్నారంటోంది ఓ అధ్యయనం.  యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా సుమారు 6,949 మందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. పెళ్లయిన ఏడాదిలోపే స్థూలకాయులుగా మారిపోతున్నారు అమ్మాయిలు. డేటింగ్‌ చేస్తున్న వారితో పోలిస్తే.. పెళ్లయిన యువతుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కసారిగా జీవనవిధానంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం అంటున్నారు అధ్యయనకర్తలు. అయితే.. పెళ్లయ్యాకా.. మునుపటిలా సన్నగా ఉండటం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యంతోపాటు.. ఆనందకరమైన వైవాహిక జీవితానికి మంచి పునాది పడుతుంది. నూతన వధువుగా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. సన్నగానే ఉండాలి. దానివల్ల మీలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటున్నారు ఫిట్‌నెస్‌ గురువులు.   అధిక బరువు ఎందుకు ముందు పేర్కొన్నట్లు జీవన విధానంలో మార్...