Skip to main content

Posts

Showing posts with the label women health tips

Women Health Tips

నెలసరి సమస్యలు చాలామందిని వేధిస్తాయి. ఇక నడుంచుట్టూ పేరుకునే కొవ్వుతో కొన్నిరకాల అనారోగ్యాలూ తప్పవు. చాలామంది మహిళలకు పెను శాపంగా మారుతున్న ఈ రెండింటినీ అదుపులో పెట్టే పరిష్కార మార్గాల్లో వ్యాయామం కీలకమైనదే. రోజూ కాసేపు వీటిని చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

Menstrual Tips

రుతుక్రమం ప్రారంభమైననాటినుంచి ప్రతి నెలా మహిళలందరికీ ఇదో తప్పనిసరి దశ.అందరికీ అదో సాధారణ అంశం. కానీ కొందరికి మాత్రం అదో శాపం, ప్రవర్తనను సంపూర్ణంగా మార్చివేసి ‘అసలు ఆమేనా ఈమె’ అనుకునేలాంటి అభిప్రాయాన్ని కలిగించే దుస్థితి ఇది అందరిలోనూ కాకపోయినా..... ఆ కొందరుమాత్రం ఇంటిల్లిపాదినీ బాధిస్తారు. కాసింతసేపు వేధిస్తారు. తీవ్రతల్లో తేడా ఉండవచ్చేమోగానీ.... దాదాపు 80 శాతం మహిళల్లో ఎంతో కొంతమేర ఈ రుగ్మతతో బాధపడేవారే. అలా నెలసరికి ఐదు నుంచి ఏడురోజుల ముందు కొందరు మహిళలలో చోటు చేసుకునే మార్పులకు కారణమే... ‘పీ.ఎం.ఎస్‌.’   ఏమిటీ సిండ్రోమ్‌........? తుఫాను ముందర కమ్ముకునే మబ్బుల్లా కొందరు మహిళల్లో పీరియడ్స్‌కి ముందు చోటుచేసుకునే లక్షణాలనే ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌. స్ర్తీలలో రుతు క్రమం మొదలైనప్పటినుంచి మెనోపాజ్‌ దశ వరకు ఈ క్షణాలు కోనసాగుతాయి. ఈ సిండ్రోమ్‌ శారీరక, మానసిక భావోద్వేగాల మయం. అంతకు ముందెన్నడూ లేని విధంగా కొంతమంది మహిళలు తమ స్వభావాలకు విరుద్ధంగా, విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఇదే. వైరుధ్యం... విచిత్రం... వైపరీత్యం... ఈ సిండ్రోమ్‌ లక్షణాలు అందరు స్ర్తీలలో ఒక...