Skip to main content

Posts

Showing posts with the label happy home

Happy Home

- పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాలో రెండు లవంగాలు ఉంచండి. - పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే అందులో కొబ్బరిముక్కను వేయాలి. -బంగారం చిలుము వదలాలంటే బ్రష్‌మీద పేస్ట్‌ వేసి బంగారు ఆభరణాలపై రుద్దాలి. -పచ్చిమిరపకాయలు ఎక్కువగా కొన్నప్పుడు వాటి తొడిమలు తీసి ఫ్రిజ్‌లో ఒక కవర్‌లో ఉంచితే ఎక్కువరోజులు నిలవ ఉంటాయి. - కొత్తిమీర, కరేపాకు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలాగాక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మొత్తగా పేస్ట్‌మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పును జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే...మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిలవవుంటాయి. - అల్లం, పచ్చిమిరపకాయలను కూడా అలాగే మొత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి, ఉప్పుకలిపి నిలవవుంచుకోవచ్చు. - పప్పు త్వరగా ఉడకాలంటే ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నూనెగానీ, డాల్డాగానీ వేసుకుంటే రుచికూడా బాగుంటుంది. త్వరగా ఉడికిపోతుంది. - నిమ్మకాయలు పిండేశాక ఆ తొక్కలను వెంటనే పారేయకుండా కుక్కర్‌ అడుగున నిలవవుండే నీళ్లల్లో వేసేసుకోవాలి. ఉడికేటప్పుడు చెడు వాసన రాకుండా ఉంటుంది. - వాడిపారేసిన ...