Skip to main content

Posts

Showing posts with the label weight loss help

Weight Loss Tips

సులువుగా బరువు తగ్గుదాం! బరువు తగ్గడానికి వ్యాయామం, డైటింగ్‌ ఎంత ముఖ్యమో .. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడమూ అంతే అవసరం. వంట పాత్రల వినియోగంతో రోజూ కాసింత బరువు తగ్గడం సాధ్యమేనని మీకు తెలుసా? * వంటల్లో వేడే, నూనె, డాల్డా, నెయ్యి వంటి వాటిని కచ్చితమైన కొలత కాకుండా ఉజ్జాయింపుగా వాడేస్తాం. కానీ కొలత ప్రకారం వాడితే కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అందుకు కప్పులు, చెంచాల కొలతలు తెలుసుకోవాలి. ఒక కప్పు - 240 మి.లీ, అరకప్పు - 120 మి.లీ, 1/3 వంతు కప్పు - 80మి.లీ, 1/4 వంతు కప్పు - 60మి.లీలు. అలాగే ఒక టీస్పూన్‌- 5మి.లీ, టేబుల్‌స్పూన్‌ - 15మి.లీలతో సమానం. వీటితో పాటు కొలతలు సూచించిన జారును ఉపయోగించాలి. * పప్పును ఉడికించుకోవడానికి ఎక్కువగా కుక్కర్‌ వాడతాం. ఇతర కూరగాయలను దీనిలో ఉడికించి తీసుకోవడం మంచిది. దానివల్ల కూరగాయల్లోని విటమిన్లు మనకు అందుతాయి. నూనె వినియోగం తక్కువగా ఉంటుంది. సమయం సద్వినియోగం అవుతుంది. * రెస్టారంట్లకు వెళ్ళినప్పుడు గమనించండి. పదార్థాలను ఒకేసారి ప్లేటు నిండా వడ్డించకుండా చిన్న ప్లేట్లలో కొంచెంకొంచెంగా వడ్డిస్తారు. ఇంట్లోను ఇలాంటి పద్ధతిని అన...