ఇల్లే వైకుంఠం అనుకుంటూ కొందరు పొద్దస్తమానం వంటింట్లోనే కాలక్షేపం చేస్తుంటారు. కొద్దిగా పెద్ద కుటుంబం అయితే సరేసరి...ఉదయం లేచిన దగ్గరనుంచి టిఫిన్స్ ఏం చేయాలా? భోజనంలో కూరలు ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు. అటువంటివారి కోసం కొన్ని వంటింటి చిట్కాలు రెడీగా ఉన్నాయి. వీటిని పాటిస్తే వంటింట్లో ఎడతెగకుండా సమస్యలుగా ఉండేవాటికి కొంత పరిష్కారం లభించినట్లే... అవేమిటో ఇప్పుడు చూద్దాం రండి... నూనె తక్కువ వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తక్కువ వేసినా కూర రుచిగా ఉండాలంటే ఈ విధంగా చేసి చూడండి. బాణాలి లేదా గిన్నె బాగా వేడెక్కిన తరువాత నూనె వేసినట్టయితే తక్కువ నూనెతో కూడా వేపుడు కూరలు చేసుకోవచ్చు. గారెల పిండిలో కొద్దిగా సేమ్యా వేయించి కలిపితే మంచి రుచిగా ఉంటాయి. తినేటప్పుడు గారెలు కరకరలాడుతూ అచ్చంగా హోటల్‌లో తిన్నట్లే ఉంటాయి. గారెల పిండి రుబ్బిన వెంటనే నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి తీసిన తరువాత గారెలు వండితే నూనె పీల్చకుండా ఉం టాయి. పెద్దవారికి కొలెస్ట్రల్ భయం ఉండదు. ఉప్పు వేసిన నీటిలో కూరగాయముక్కలను కొద్ది సేపు ఉంచి ఆ తరు వాత వాటిని ఉడకబెడితే త్వరగా ఉడుకుతాయి. ఎండాకాలం ...
Kids Stories, Powerful Women, Tips and Tricks, Cooking