Skip to main content

Posts

Showing posts with the label women-health

Women Health

గర్భిణులు వారంలో మూడు సార్లు చేపలు ఆహారంగా తీసుకుంటే పుట్టే పిల్లలు చదువులో చురుకుగా ఉంటారు. ఇదేదో ఆషామాషీగా చెప్పింది కాదు. బ్రిటిష్‌, అమెరికన్‌ వైద్యులు సుమారు పన్నెండు వేల మంది గర్భిణుల మీద ఏడాది పాటు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని నిర్థరించింది. వారిలో సగం మందికి వారానికి 340 గ్రాముల సముద్రపు చేపల్ని అందించారు. మిగిలిన సగం మందికి 170 గ్రాములే ఆహారంగా ఇచ్చారు. వారందరూ ప్రసవించి, పిల్లలు ఎనిమిదేళ్ల వయసొచ్చాక లోతైన అధ్యయనం జరిపారు. దాన్లో 340 గ్రా. చేపలు తీసుకున్న పిల్లలు చదువు, ఆటపాటలు, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. మిగతా వారు మామూలు పిల్లల్లానే మసిలారని తేలింది. కడుపుతో ఉన్న వారు చేపలు, అవిశె గింజలు, వాల్‌నట్స్‌ ఎక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణుల సలహా.