1.బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే చారెడు ఉప్పు వేసి 10 నిమిషాలు నాననిస్తే మట్టిగడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి. 2. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట క్రింద పాత పేపరు వేసుకుంటే, తరిగిన తొక్కలను అలాగే పేపరుతో ఎత్తి బైట పారేయవచ్చు. లేకపోతే అనంతరం ఊడ్చుకోవడం శ్రమ, టైం వేస్టూనూ. 3. కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి, ఆ తరువాతనే తరగాలి.అంతేగాని ముందుగా తరిగేసి,తరువాత కడగకూడదు. 4. ముందుగా కడిగినా కూడా అరటికాయ మొదలైనవాటిని తరిగి నీళ్ళలోనే వేయాలి. ఇటువంటి కూరలు రెండుసార్లు శుభ్రపడవలసిందే. 5. కూరగాయముక్కల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే ఏవైనా క్రిములు ఉంటే అవి పైకి తేలిపోతాయి. 6. కూరలను మరీ సన్నగాను నాజూకుగానూ తరగకూడదు. అందువల్ల వాటిలోని పోషకాంశాలు నశించే ప్రమాదముంది. 7. కొన్ని కూరలు తరిగేటప్పుడు చేతులు బంకగానో, పొరలు గానో వచ్చేస్తూనో ఉంటాయి అరటి పనస వంటి కూరలు.తరిగేముందు చేతులకు కొంచెం నూనె రాసుకుని తరిగితే ఆ విధంగా జరగదు. 8. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతుల్ని చింతపండు రసంలో తడుపుకుంటే దురదలు పుట్టవు. 9. తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది. 10. ...
Kids Stories, Powerful Women, Tips and Tricks, Cooking