Skip to main content

Posts

Showing posts with the label rice varities

Annam tho Varities

అన్నం మామూలుగా వండేసి పెట్టుకోండి.కాని పొడిపొడిగా ఉండాలి. మెత్తగా ఉంటే ఏమి చేయలేము. 1. ఒక గిన్నెలో ఒ గరిటెడు నూనె తీసుకునిఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,కాస్త మినప్పప్పు,శనగపప్పు,కరివేపాకు పసుపు వేసి కాస్త వేగిన తర్వాత దింపేసి ఓ నిమ్మకాయ పిండి ఉప్పు వేసి అన్నంలో కలిపేస్తే నిమ్మకాయ పులిహార రెడీ   2. పచ్చి కొబ్బరి ఉంటె తురిమి పెట్టుకోండి.గిన్నెలో నూనె వేసి , ఎండుమిర్చి పోపు గింజలు వేసి చిటపటలాడాక కరివేపాకు,పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. అన్నంలో తగింత ఉప్పు కలిపి పోపును,ఓ స్పూను నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ పదినిమిషాల తర్వాత తిండానికి కొబ్బరి పులిహార రెడీ.ఇందులో పసుపు వేయకూడదు. కొబ్బరి వేపకూడదు.   3. నిమ్మకాయ పులిహార ఎండుమిర్చి కాని పచ్చిమిర్చితో కాని చేసుకోవచ్చు.అప్పుడప్పుడు అల్లం తురిమి పోపులో వేస్తె అదో అదిరే టేస్ట్.   4. క్యారట్,బీన్సు సన్నగా ముక్కలుగా కోసి కాస్త ఉడికించి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తర్రిగి,రెండు పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,శనగపపు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ...