Skip to main content

Posts

Showing posts with the label Tips for women

Health Tips for Women

బహిష్టు నొప్పి హోమియోథెరపీ ‘స్ర్తీలకు సంబంధించి కలిగే ఆరోగ్య సమస్యల్లో గర్భాశయానికి సంబంధించి చాలామంది బాధపడుతుంటారు. సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో నెలసరి సమస్య ఒకటి. వీటితోపాటు అధికశాతం మంది స్ర్తీలు పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీనినే బహిష్టునొప్పి అంటారు. దీనికి హోమియోవైద్యంలో ఉన్న ఆధునిక వైద్య విధానం గురించి హోమియో వైద్య నిపుణురాలు డాక్టర్‌ శ్రీదేవి ఇలా వివరిస్తున్నారు...’ ఈ రోజుల్లో యుక్తవయస్సువారు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ ఎక్కువగా టెన్షన్‌ తీసుకోవడం వల్ల గర్భాశయంలోని హార్మోన్స్‌ సరైనక్రమంలో పనిచేయక గర్భాశయ సమస్యలకు దారితీస్తోంది. డిస్మనోరియా అన్ని వయస్సులోని వారు బాధపడే ప్రధాన సమస్య. ఎక్కువగా యుక్తవయసు అమ్మాయిలను విపరీతంగా బాధపెట్టే సమస్య. బహిష్టు నొప్పి వల్ల స్కూల్‌కు, కాలేజీలకు సెలవు పెట్టడం, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం, చికాకుగా ఉండడం, ఏ పనీ సరిగ్గా చేసుకోలేక నేటికీ చాలామంది స్ర్తీలు మౌనంగా భరిస్తూ ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతినెలా క్రమంతప్పకుండా వచ్చే బహిష్టునొప్పి నివారణకు ఔషధాల...

Menstrual Tips

రుతుక్రమం ప్రారంభమైననాటినుంచి ప్రతి నెలా మహిళలందరికీ ఇదో తప్పనిసరి దశ.అందరికీ అదో సాధారణ అంశం. కానీ కొందరికి మాత్రం అదో శాపం, ప్రవర్తనను సంపూర్ణంగా మార్చివేసి ‘అసలు ఆమేనా ఈమె’ అనుకునేలాంటి అభిప్రాయాన్ని కలిగించే దుస్థితి ఇది అందరిలోనూ కాకపోయినా..... ఆ కొందరుమాత్రం ఇంటిల్లిపాదినీ బాధిస్తారు. కాసింతసేపు వేధిస్తారు. తీవ్రతల్లో తేడా ఉండవచ్చేమోగానీ.... దాదాపు 80 శాతం మహిళల్లో ఎంతో కొంతమేర ఈ రుగ్మతతో బాధపడేవారే. అలా నెలసరికి ఐదు నుంచి ఏడురోజుల ముందు కొందరు మహిళలలో చోటు చేసుకునే మార్పులకు కారణమే... ‘పీ.ఎం.ఎస్‌.’   ఏమిటీ సిండ్రోమ్‌........? తుఫాను ముందర కమ్ముకునే మబ్బుల్లా కొందరు మహిళల్లో పీరియడ్స్‌కి ముందు చోటుచేసుకునే లక్షణాలనే ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌. స్ర్తీలలో రుతు క్రమం మొదలైనప్పటినుంచి మెనోపాజ్‌ దశ వరకు ఈ క్షణాలు కోనసాగుతాయి. ఈ సిండ్రోమ్‌ శారీరక, మానసిక భావోద్వేగాల మయం. అంతకు ముందెన్నడూ లేని విధంగా కొంతమంది మహిళలు తమ స్వభావాలకు విరుద్ధంగా, విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఇదే. వైరుధ్యం... విచిత్రం... వైపరీత్యం... ఈ సిండ్రోమ్‌ లక్షణాలు అందరు స్ర్తీలలో ఒక...

Women Health

ఆ నొప్పి .. ఎలా దూరం? ప్రపంచ వ్యాప్తంగా సుమారు 67.2 శాతం మంది స్త్రీలకు నెలసరి నొప్పి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు పొత్తి కడుపులో నొప్పిగా ఉండటం, కాళ్లు లాగటం, నరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు, నడుంనొప్పి, కూర్చోలేక, నిలబడలేక పోవడం.. ఒక్కోసారి తలతిరిగి పడిపోవడం వంటి మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలకు ప్రతీమాసం 3-4 రోజుల పాటు నెలసరిదశ తప్పదు. ఈ సమయంలో శరీరంలోని హార్మోన్ల మార్పు వల్ల గర్భసంచిలోని కండరాలలో అసాధారణ సంకోచ, వ్యాకోచాలు జరిగి కడుపునొప్పి వస్తుంది. స్రావం అధికంగా ఉంటే అది గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. * కొంతమంది స్త్రీలకు బహిష్ఠులు మొదలైనప్పటి నుంచి వివాహమై, పిల్లలు పుట్టే వరకు ఉంటుంది. * మరికొందరికి శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతలు, అవయవ సంబంధమైన ఈ కింది సమస్యల వల్ల వస్తుంది. గర్భాశయం.. పొరలు బయటకు వెడలడం, ఇరు పక్కల ఉండే ట్యూబులు మెలిపడటం, ఇన్‌ఫెక్షన్‌ రావడం, గర్భనిరోధక పరికరాలను సరిగా అమర్చకపోవడం, అండాశయాలలో తిత్తులు, కణితుల వలన బహిష్ఠు సమయంలో కానీ ముందుగానీ నొప్పి వస్తుంది. ఎవరికి అధ...

Diet During Pregnancy

తల్లీబిడ్డల...పోషకాహారం బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని కూడా తెలుసు. గర్భిణులు ఐరన్‌ మాత్రలు తీసుకునేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటిస్‌ వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిపాలల్లో ఉండే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలో ఉండవన్నది నగ్నసత్యం... మన భారతీయుల్లో స్థూలకాయం, షుగర్‌ చాలా ఎక్కువ. నలభైలు దాటీ దాటక ముందే అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇంత చిన్న వయసులో ఉన్న వారికి కూడా చక్కెర వ్యాధి వచ్చే ధోరణి మొదలైంది. ఇప్పటివరకూ స్థూలకాయం, చక్కెర వ్యాధులకు శారీరక వ్యాయామం లేకపోవడం, తిండి అలవాట్లు, ఒత్తిడి కారణమని వైద్యులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. పుణెలోని కింగ్‌ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ హాస్పటల్‌ డయాబెటీస్‌ యూనిట్‌ డయాబెటీస్‌ పేషంట్ల సంఖ్య పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తూ అధ్యయనాలు చేసినప్పుడు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న కారణాల కంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయని గుర్తించింది. బ్రిటన్‌లో ఉన్న చక్కెర వ్యాధిగ్రస్థుడి...

Tips for Women

అమ్మదనపు ఆనందం ఓ వైపు. అంతలోనే ఇంతటి లావు తగ్గుతామా.. పూర్వపు అందం సొంతం అవుతుందా అంటూ చాలామంది తల్లుల ఆందోళన. దాంతో ప్రసవం అయినప్పటి నుంచీ రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. అధికబరువు కొందరి సమస్య అయితే.. పొట్టపై చారలు.. చర్మ సంరక్షణ మరికొందరిని వేధిస్తుంది. వీటిని దూరం చేసేందుకు కొన్నిదేశాల్లో మహిళలు పాటించే చిట్కాలేమిటో చూద్దాం. * ప్రసవం అయినప్పటినుంచీ .. అధిక బరువును దూరం చేసేందుకు జపనీయ యువతలు ఏం చేస్తారో తెలుసా.. భోజనం అయిన ప్రతిసారీ కప్పు గ్రీన్‌ టీ తాగుతారు. దాంతో కొన్నాళ్లకు శరీరం చెక్కిన శిల్పంలా తయారవుతుంది. * పరగడుపునే ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కొద్దిగా తీసుకోవడం చాలామంది హాలీవుడ్‌ భామల అలవాటు. రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. దాంతో కొన్నాళ్లకు సన్నబడటం ఖాయం. అలాగే చర్మం నిగారింపునూ సంతరించుకుంటుందనేది వీరి నమ్మకం. * మన భారతీయుల ప్రకారం. . పొడిబారిన చర్మానికి.. పొట్టపై పడిన చారలు దూరం చేసేందుకు కొబ్బరినూనె మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే.. చారలు పూర్తి స్థాయిలో పోవు కానీ.. సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది. * పాపాయిని చూసుకోవడం వల్ల కొన్నిసార్లు రాత్ర...

Tips for Women

How to reduce menstrual pain Some women go through excruciating pain and cramps during their menstrual cycle, so much so that they are unable to work. They just lie in bed feeling miserable and resort to painkillers. If you are plagued by a similar problem, try a diet change for about a month and take a few supplements. A healthy diet of whole grains, fruits and pulses is very helpful. At the same time, you need to avoid oily food, nonvegetarian food, milk and milk products. Certain supplements such as calcium and vitamin B6 are also particularly effective in tackling PMS. Calcium: Research suggests that increasing calcium intake can help reduce menstrual pain and PMS symptoms, however, certain lifestyle factors such as smoking, deficiency of vitamin D , consuming excess sodium, sugar, caffeine or animal proteins acceler ates calcium loss — nearly 70 per cent passes right through without even being absorbed by the digestive tract and a portion of w...