నా జూకైన నడుము, చూడముచ్చటైన శరీరాకృతి, శారీరకంగా కావాలంటే చేయవలసిందల్లా మీరు కాస్తంత సమయం కేటాయించాలి.మీకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కాస్త వ్యాయామం చేయడమే. ఆరోగ్యమైన అందమైన ఫలితాలు సొంతమవుతాయి. సమాంతరంగా ఉన్న నేల పై వెల్లకిలా పడుకొని చేతులను జోడించి తల వెనక్కి నిటారుగా పెట్టండి.ఇప్పుడు మీ కుడి మోకాలును నెమ్మదిగా పైకి లేపండి. ఇలా మీ పాదం నేలకు సమాంతరంగా ఆనుకునే వరకు లేపండి. తల వెనక్కి పెట్టిన చేతులలానే మీ కుడికాలును కూడా ముందుకు నిటారుగా అంటే పాదం పూర్తిగా ముందుకు వంచగలిగినంత వంచండి. ఇప్పుడు తల వెనక్కి జోడించి పెట్టిన చేతులను మీ ఎడమ కాలిమీదకు అలాగే నిటారుగా తీసుకురండి. ఇలా ముందుకు, వెనక్కు మోచేతులు ఏమాత్రం వంచకుండానే చేయండి. ఇప్పుడు కుడికాలును అలానే ఉంచి ఎడమకాలును నేలకు 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. ఇదే భంగిమలో ఉండి శ్వాసను మాములుగానే తీసుకుంటుండాలి. ఇలా ఐదు సెకండ్లపాటు ఉండండి. శిరస్సు వెనక్కి ఉన్న చేతులను అలానే తెచ్చి మీ ఎడమ కాలును తాకించండి. ఈ ప్రయత్నంలో మీ మెడను జాగ్రత్తగా ముందుకు వంచండి. ఊపిరి మామూలుగానే తీసుకుంటూ ఈ వ్యాయామాన్ని అనేక సార్లు చేయండి. ...
Kids Stories, Powerful Women, Tips and Tricks, Cooking