నాజూకైన నడుము, చూడముచ్చటైన శరీరాకృతి, శారీరకంగా కావాలంటే చేయవలసిందల్లా మీరు కాస్తంత సమయం కేటాయించాలి.మీకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా కాస్త వ్యాయామం చేయడమే. ఆరోగ్యమైన అందమైన ఫలితాలు సొంతమవుతాయి.
సమాంతరంగా ఉన్న నేల పై వెల్లకిలా పడుకొని చేతులను జోడించి తల వెనక్కి నిటారుగా పెట్టండి.ఇప్పుడు మీ కుడి మోకాలును నెమ్మదిగా పైకి లేపండి. ఇలా మీ పాదం నేలకు సమాంతరంగా ఆనుకునే వరకు లేపండి. తల వెనక్కి పెట్టిన చేతులలానే మీ కుడికాలును కూడా ముందుకు నిటారుగా అంటే పాదం పూర్తిగా ముందుకు వంచగలిగినంత వంచండి. ఇప్పుడు తల వెనక్కి జోడించి పెట్టిన చేతులను మీ ఎడమ కాలిమీదకు అలాగే నిటారుగా తీసుకురండి. ఇలా ముందుకు, వెనక్కు మోచేతులు ఏమాత్రం వంచకుండానే చేయండి. ఇప్పుడు కుడికాలును అలానే ఉంచి ఎడమకాలును నేలకు 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. ఇదే భంగిమలో ఉండి శ్వాసను మాములుగానే తీసుకుంటుండాలి. ఇలా ఐదు సెకండ్లపాటు ఉండండి. శిరస్సు వెనక్కి ఉన్న చేతులను అలానే తెచ్చి మీ ఎడమ కాలును తాకించండి. ఈ ప్రయత్నంలో మీ మెడను జాగ్రత్తగా ముందుకు వంచండి. ఊపిరి మామూలుగానే తీసుకుంటూ ఈ వ్యాయామాన్ని అనేక సార్లు చేయండి.

నమస్కార భంగిమలో...
ఇప్పుడు అదే చేతులను మీ ఛాతిపైకి తీసుకురం డి. నమస్కారం చేసే విధంగా తల నుంచి మీ భుజాల వరకు మాత్రం అలా గాలిలోనే ఉండనీయం డి.ఇప్పు డు జోడించిన ఆ చేతులను ఇంతకు ముందు మీ ఎడమ కాలిని తాకిన చోటికీ, ప్రస్తుతం ఉన్న చోటికీ అదే ఆకారంలో ముం దుకూ, వెనక్కి మార్చండి. ఇలా చేసే క్రమంలో కుడికాలు పాదం నేలకు పూర్తిగా ఆనుకుని ఉండేలా చూసుకోండి. కాళ్లు కాస్త దూరంగా ఉండేలా నిలబడి రెండు చేతులను తలపైకి నిటారు గాపెట్టి, ఒక చేతి తో మరొక చేతి వేళ్లలను పట్టుకొని రెండు పక్కలకు నడుమును వంచుతూ వ్యాయామం చేయాలి. చేసేటప్పుడు మోకాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
నడుముకు నాజూకుతనాన్ని ఇచ్చే వ్యాయామాలు.
మీరు ఇలా కొన్ని సార్లు చేసిన తరువాత కుడివైపుగా వంగినపుడు కుడిచేతితో విడిగా మీ కుడి కాలును తాకండి, ఎడమవైపూకు వంగి నపుడు ఇదే విధంగా ఎడమచేతి తో విడిగా ఎడమకాలును తాకం డి.ఇలా కొన్నిసార్లు చేయాలి. పక్కకు వంగి చేతితో కాలిని తాకినపుడు అలానే పదిసెకన్లు పాటు ఉండాలి. మీ శక్తిని పూర్తిగా ఉపయోగించి అలా చేసి న తరువాత నిటారుగా నిలుచుని మళ్ళీ రెండవ పక్కకు శరీరాన్ని వంచి ఇదే వ్యాయామాన్ని కొనసాగించాలి.
కొవ్వును తగ్గించుకునేలా..
ఇలా ప్రయత్నం చేస్తూపోతే మీ చేయికాలి పాదాన్ని ఆ తరువాత నేలను తాకే స్థాయికి శరీరాన్ని రెండు పక్కలకు వంచగలుగుతారు. అప్పు డు ఇక నడుముకు చుట్టుపక్కల అనవసరమైన కొవ్వు కనిపించకుండాపోయి నడుము నాజూకు గా, బలంగా తమారవుతుంది.
ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య నాలు గడుగుల దూరం ఉండేలా నిటారుగా నిలబడాలి. రెండు చేతులను తలపైకి నిటారుగా పెట్టి రెండు అరచేతుల వేళ్ళను ఒకదానిలోకి ఒకటి జొప్పించి, వెనక్కి విరిచి పెట్టినట్లుగా వీలైనంత ఎత్తుకు చేతులను చాచడానికి ప్రయత్నించాలి. మోచేతుల ను మాత్రం నిటారుగా ఉంచాలి. ఇప్పుడు శ్వాసను వీలైనంత తీసుకుని ఐదుసెకన్ల తరువాత నెమ్మదిగానే బయటకు వదలాలి.

పొట్ట కండరాలను గట్టిపరచే వ్యాయామం
నేలపై బోర్లా పడుకోండి. ముఖంనుంచి పాదాల వేళ్లవరకూ నేలకు ఆనేలా నిటారుగా పడుకోవాలి. అలా పడుకున్నపుడు రెండు ఆరచేతులూ తొడలకింద (అరచేయి తొడలను తాకేవిధంగా) చేర్చాలి. పాదాలనుంచి తల వరకూ శరీరంలో ప్రతి భాగం నిటారుగా ఉంచేందుకు ప్రయత్నిం చాలి. ముఖ్యంగా వెన్ను నిటారుగా పెట్టాలి.
శ్వాసను తీసుకుంటూ...
తరువాత నెమ్మదిగా మీ కుడికాలును ఎంతవరకు లేపగరో అంతవరకు పైకి లేపండిఈ సమయంలో మామూలుగానే శ్వాస తీసుకుంటూ మధ్యలో ఆరు సెకన్లు వ్యవధి ఉండేలా చూసుకోండి. ఇలా కాలును ఉంచగలిగినంత సేపుఉంచి తరువాత నెమ్మదిగా శ్వాసను వదులుతూ కాలును నేలకు ఆన్చండి తరువాత ఇదే విధానాన్ని రెండవ కాలుకు కూడా పాటించండి.
కాళ్లను నేలకు ఆనించి...
తరువాత నుదురును నేలకు ఆన్చి రెండు కాళ్లను ఒకేసారి పైకి లేపండి. ఇలా కాళ్లను లేపేటపుడు శ్వాసను బిగ్గరగా తీసుకోండి. ఈ సమయంలో కూడా మీ మోకాళ్లు నిటారుగానే ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా ఎంతసేపు గాలిలో కాళ్లను నిటారుగా ఉంచగలరో అంతసేపూ ఉంచండి. తరువాత నెమ్మదిగా కాళ్లను నేలకు ఆన్చి తల ఒక పక్కకు వాల్చి విశ్రాంతి పొందండి.
చక్కని శరీరాకృతి...
ఈ పద్దతులన్నీ పాటించినట్లైతే మీ కాళ్లు, పొట్ట కండరాలకు అత్యవసరమైన శక్తిని చేకూర్చుతాయి. శరీరానికి చక్కని తీగలాంటి ఆకృతిని కూడా పొందుతారు. నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఒత్తిడినుంచి దూరం అవుతారు. దీనితోపాటు మంచి పోషక విలువలు ఉండే ఆహారం...ప్రతినిత్యం నీరు అధికమోతాదులో తాగుతూ ఉండా లి...కొవ్వును కలిగించే ఆహారపదార్ధాలకు దూరంగా ఉండండి...
బాగా పీచుపదార్ధాలు ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి.
బాగా పీచుపదార్ధాలు ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి.
Comments
Post a Comment