Skip to main content

Posts

Showing posts with the label karbujja mysorepak

karbujja Mysorepak

ఉప్పులేని కారప్పూస 400 gms కోవా - 400 gms పాలు - 250 ml చక్కెర 300 gms నెయ్యి - 200 gms కారప్పూసను చేతితో మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి వేడెక్కిన తర్వాత అందులో కోవా వేసి మొత్తం కలిసేంతవరకు కలియబెట్టాలి.ఇప్పుడు కారప్పూస పొడి, చక్కెర వేసి నెమ్మదిగా కలియబెడుతూ వుండాలి. అంతా గట్టిపడిన తర్వాత నెయ్యి వేస్తూ మెల్లిగా కలియబెట్టాలి. నెయ్యి మొత్తం వేసిన తర్వాత కొద్ది సేపు పొయ్యి మీద ఉంచి కిందకు దింపేయాలి. మందపాటి పళ్ళేనికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. దానిని సమానంగా సర్దాలి. చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో ముక్కలు చేసుకోవాలి ఇవి వారం వరకు నిల్వ ఉంటాయి.