Skip to main content

Posts

Showing posts with the label thick hair

Thick Hair

నిమ్మకాయ రసంతో తలంతా మర్ధన చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది. మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారాక ఒక సీసాలో నిలవచేసుకుని ప్రతిరోజూ రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది. గోరింటాకు ఎండబెట్టి పొడిగా చేసుకుని కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడతాయి. పెరుగు, నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకుని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు నివారణ అవుతుంది. మార్కెట్లో దొరికే కలర్‌ డైలను ఎక్కువగా వాడకూడదు. సాధ్యమైనంత వరకూ సహజసిద్ధంగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్లో మెహిందీ పొడి దొరుకుతుంది. దానితో సహజసిద్ధమైన డైని తయారుచేసుకుంటే మంచిది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవు. ఉసిరికపొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పెద్ద ఉసిరికాయలు (ఆమ్లా) చౌకగా లభ్యమయ్యేకాలంలో వాటిని తీసుకుని ఎండబెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకుని...వాటిని తలకు పట్టిస్తే చుండ్రు, పేలు నివారణ అవుతాయి. మార్కెట్లో లభ్యం అయ్యే చౌకరకాల షాంపూలను, సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.