Skip to main content

Posts

Showing posts with the label makeup tips

Beauty Tips

అధర సౌందర్యం... 'కాస్మెటిక్స్‌ ఎన్ని వాడినా అధరాలకు అందం రావట్లేదు. నిర్జీవంగా కన్పిస్తున్నాయి' అనుకునే వారు ఈ కింది చిట్కాలపై ఓ కన్నేయండి. * స్నేహితులు వేసుకున్న లిప్‌స్టిక్‌ రంగు బాగుందనో, మంచి బ్రాండ్‌ అని మీరు అలాంటి దానినే ఎంచుకుంటే అది మీ చర్మ తత్వానికి సరిపడక పోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన లిప్‌స్టిక్‌లు, పరిమళభరితమైన వివిధ రకాల లిప్‌గ్లాసులు వాడటం వల్ల ఎలర్జీకి దారి తీయడం, పెదాలు నల్లగా మారటం జరుగుతుంది. ఒక్కోసారి ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. * ఆకర్షణీయమైన రంగు గల టూత్‌పేస్ట్‌లు సైతం ఎలర్జీకి కారణమౌతాయి. సాధ్యమైనంత వరకు తెలుపు టూత్‌పేస్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. * పెదాలపై చర్మం చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు నిత్యం వాడితే తేమ కోల్పోతాయి. ఇతరులు ఉపయోగించిన గ్లాసులు, కప్పులు తిరిగి వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది.