Skip to main content

Posts

Showing posts with the label Tips for Babies

Tips for Babies

పది నెలల వయస్సున్న పాప వుంది. పగలంతా బాగానే ఆడుకున్నా సాయంత్రం వేళకి మాత్రం పాప గుక్క పట్టి ఏడుస్తుంది. రాత్రీళ్ళు సరిగ్గా నిద్రపోదు. ఈ ఏడుపుకు కారణమేంటో తెలియక సుజన ఆందోళన చెందుతూ వుంటుంది. పెద్దవారిని అడిగితే పిల్లలు కదా! అజీర్తి మూలంగా అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంటుంది. ఇది మామూలే! పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదు అని చెప్పారు. కానీ పాప పరిస్థితీని చూసిన దంపతులకు ఆందోళన ఎక్కువై డాక్టర్‌ని సంప్రదించారు. పిల్లలు ఏడుపునకు కారణాలు డాక్టర్‌ వివరించడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. కడుపు నొప్పి అని తెల్సుకునేదెలా? సాధారణంగా పిల్లల్లో కడుపు నొప్పి మూడు నాలుగు నెలల వయసు నుంచే మెదలవుతుంది. ఈ వయసు పిల్లలు కడుపునొప్పి వస్తుందని చెప్పలేరు, దాన్ని పెద్దలే తెల్సుకోవాలి. గుక్కతిప్పుకోకుండా ఏడుస్తారు. ఇలా ఏడవడంతో ముఖం, అరచేతులు, అరికాళ్ళు బాగా ఎర్రబడతాయి పడుకోబెట్టిన కొద్ది సేపట్లోనే లేచి మళ్లీ ఏడుపు అందుకుంటారు.