టీనేజ్ నుంచి ముపె్పైల వరకు ఆడవారిని ఎక్కువగా బాధించేసమస్యలలో ఒకటి మొటిమలు. నలభై వచ్చే సరికి మంగు ( పిగ్మంటేషన్ ) విసిగిస్తుంది. మొటిమలు, మంగు ఎదైనా సరే సౌందర్యాన్ని సవాల్ చేసే సమస్యలే. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న ఆడవారికి వీటిని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు...
ట్రీట్‌మెంట్
* ఒక స్పూన్ గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు,బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.
* మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని కడుపులోకి తీసుకోవచ్చు లేదా చర్మం మీద రాయవచ్చు.
* గర్భిణులు ఆలోవెరా గుజ్జు కడుపులోకి తీసు కోకూడదు.
* దాల్చిన చెక్కను పేస్ట్ చేసి మొటిమల పై రాసి కా సేపాగి కడిగేయాలి.
* రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకుల పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
ిపిగ్మంటేషన్ పోవాలంటే
*అయిదు బాదంపప్పులను పొడిచేసి అందులో ఒక టీ స్పూన్ మీగడ, కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి పది హేను నిముషాల తర్వాత కడిగేయాలి.
*తెల్ల నువ్వులకు కొద్దిగా పసుపు కలిపి రెండింటినీ గ్రైండ్ చేసి మంగు ఉన్న చోట రాయాలి,
*మంగుకు తులసి ఆకుల రసం కూడా బాగా పని చేస్తుంది. తులసి ఆకులను పేస్ట్‌చేసి మచ్చలపై రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
* మొటిమలు తగ్గడానికి హోమియోలో కూడా మంచి మందులు ఉన్నాయి. డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే వాడాలి. మార్కెట్లో ఏవిపడితే అవి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చి చర్మం పాడయ్యే ప్రమాదం ఉంది.
* అప్పుడప్పుడు బ్యూటీషియన్ వద్దకు వెళ్లి మొహానికి స్టీమ్ బాత్ చేయించు కోవాలి. మొహం జిడ్డుకా రకుండా గోరువెచ్చని నీటితో గంటకొక సారి కడగాలి.
* చర్మం రఫ్‌గా తయార వకుండా ఉండాలంటే మొహం తుడుచుకోవడానికి మొత్తని మక్ మల్ క్లాత్ లేక కాటన్ బట్టతో తడి ఉన్నచోట అద్దితే సరిపోతుంది.
Comments
Post a Comment