మోడల్స్... ఫిట్‌నెస్ మంత్రం
ఫ్యాషన్ రంగానికి చెందిన వారు అతిగా తిని, తాగి తందనాలడతారని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారా...? అయితే మీరు పప్పులో కాలేసినట్లే... వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తీవ్రంగా కష్టపడతారు. తమ వృత్తిలో నిలదొక్కుకునేందుకు వారు తిండి, నిద్ర, వ్యాయామం తదితరాలపై దృష్టి పెడతారు. తమ వృత్తిలో సరైన తిండి, హాయిగా నిద్రపోవడం, తరచూ ఎకై్సర్‌సైజ్ చేస్తే మంచి స్థాయికి చేరుకోవచ్చని మోడళ్లు నమ్ముతున్నారు. ఈ మేరకు ఓ మ్యాగజైన్ మోడళ్ల ఫిట్‌నెస్ మంత్రంపై సర్వే నిర్వహించింది. పలు ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అన్నం తిని ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదు. అంతేకాకుండా రాత్రి భోజనంలో అన్నం, గోధులమలతో కూడిన కార్బొహైడ్రేట్‌లను తీసుకోవద్దని అమనీర్‌వాహీ అనే మోడల్ వెల్లడించారు. ‘ఎవరైనా సలాడ్లు కానీ, కూరగాయలు లేదా చికెన్, సూప్స్ డిన్నర్‌లో తీసుకున్నప్పుడు వెంటనే పడుకోవద్దు. మీరు తిన్న పదార్థాలు ఏవైనా ఉంటే అవి అరగడానికి సమయం పడుతుంది. మీ శరీరం చెప్పేది వినండి... దానిని పాటించండ’ని వాహీ వివరించారు. మరో మోడల్ లక్ష్మీరాణా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. మీ పొట్ట పెరగకుండా చదరంగానే ఉండాలంటే రాత్రి 7:30 తర్వాత మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ కార్పొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవద్దని ఆమె చెబుతున్నారు. ‘ఈ మంత్రం నా శరీరంలో ఎన్నో అద్భుతాలు చేసింది. అయితే మీరు రాత్రి పూట పూర్తిగా భోజనం చేయకుండా వదిలేయవద్దు... అలాగని రాత్రి 7:30 తర్వాత అధికంగా తినవద్దు. మీ శరీరంలో వచ్చే మార్పులు మీకే అర్ధమవుతాయ’ని లక్ష్మీరాణా వివరించారు.
నోరు కట్టేసుకోవాల్సివస్తుంది... అయితే కొన్ని సమయాల్లో తాము నోరు కట్టేసుకోవాల్సి వస్తుందని మోడళ్లు వాపోతున్నారు. స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు, ఫంక్షన్లు ఇతర పార్టీలకు హాజరవుతున్నప్పుడు అక్కడి పదార్థాలను చూడగానే నోరూరుతుందని అయితే వాటి నుంచి దృష్టి మరల్చుకోక తప్పడం లేదని వారు వివరిస్తున్నారు. ఈ మేరకు పార్టీలకు డుమ్మాలు కొట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు. సరైన తిండి తినడంతో పాటు వ్యాయమం చేయడం కూడా తప్పని సరి అని మోడళ్లు వివరిస్తున్నారు. మెడిటేషన్ లేదా ఏదైనా ఒక ఆట నిత్యం ఆడుతుంటే శరీరంలో ఉన్న అదనపు కాలరీలు కరిగిపోతాయని వారంటున్నారు.
ఆరోగ్య నియమాలు తప్పనిసరి... ఫ్యాషన్ డిజైనర్ రీతూకుమారి కొద్ది నెలలుగా పన్నెండు కిలోల బరువు కోల్పోయారు. ఆమె ఆరోగ్యకరమైన జీవనవిధానానికి కారణం నిత్యం వ్యాయమం చేయడం, ఆహార నియమాలు పాటించడమే. ‘నా శరీరం విపరీతంగా పెరిగిపోయింది. అనారోగ్యాలు చుట్టుముట్టాయి. దీంతో నాకు నేను అనుకుని, వ్యాయామానికి సంబంధించిన షూస్ వేసుకున్నాను. అంతే జీవనవిధానంలో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు చెబుతున్నా. నా జీవనవిధానంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోదు. పండ్లు, చపాతీలు, ఓట్‌మీల్, జావ తదితర పదార్థాలు‚ భోజనంలో ఉండేలా చూసుకుంటాన’ని ఈ 65 ఏళ్ల డిజైనర్ వివరించారు.
శాఖాహారమే బెస్ట్... అయితే మరికొంత మంది మోడళ్లు హఠాత్తుగా శాఖాహారానికి మారిపోతున్నారు. మటన్,చికెన్‌లాంటి తింటే ఖచ్చితంగా శరీరంలో విపరీతమైన కొవ్వు పేరుకుపోతుందని వారి భయం. అందుకే వారు అలాంటి పదార్థారాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అదంతా వట్టి భయమేనని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. మనం ఏం తిన్నామన్నది ముఖ్యం కాదని, శరీరంలోకి చేరే కొవ్వు పదార్థాలు, కేలరీలు చూసుకోవాలని వారు చెబుతున్నారు.అయితే మాంసాహారుల కంటే శాఖాహారుల శరీరంలో కొవ్వు పదార్థాలు చేరే అవకాశాలు తక్కువ అని ప్రీతి అనే మోడల్ వివరించారు. అంతేకాకుండా మాంసాహారులతో పోల్చుకుంటే మసాలా వస్తువులు తీసుకోవడం కూడా తక్కువేనని అంటున్నారు. మరోవైపు ఫిట్ అంటే కేవలం తిండి, నిద్ర, వ్యాయాయమే కాకుండా నిత్యం సంతోషంగా ఉండాలని అప్పుడే అందం ద్విగుణీకృతం అవుతుందని పలువురు మోడళ్లు విశ్వసిస్తున్నారు. మనం ఆనందంగా అది మన ముఖంలో ప్రతిఫలిస్తుంది. అందుకే ఆనందంగా ఉండాలని వారు చెబుతున్నారు.
విశ్రాంతి కూడా అవసరమే...

గీతికాగంజు తొమ్మిది గంటల పాటు నిద్ర లేకుండా ఉండలేరు. మన శరీరం విశ్రాంతిని కోరుతుంది. దానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. అందుకే నేను హాయిగా నిద్రపోతాను. అదే నా ఫిట్‌నెస్ మంత్రమని గీతిక వివరించారు. సినిమా యాక్టర్ రిషి, నీతూకపూర్ల కూతురు రిధిమాను మీ ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తాను ఎలాంటి శ్రద్ధ తీసుకోనని సమాధానం చెబుతారు.
‘మీరు మీ దంతాలను ఏ విధంగా శుభ్రం చేసుకుంటారో అదేవిధంగా వ్యాయామాన్ని కూడా దినచర్యలో భాగం చేసుకోవాలి. అంతేకాకుండా ఇది తినాలి. అది తినాలని నేనేం నియమం పెట్టుకోను. అయితే తినేవి మాత్రం ఆరోగ్యానికి మేలు చేసేవా..? కాదా...? అని మాత్రం ఆలోచిస్తాను. సాధ్యమైనంత వరకు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోను. అంతే అంటూ నవ్వుతూ సమాధానం చెబుతారామె.
వృత్తిరీత్యా తప్పదు...

సాధారణంగా మనం టీవీల్లో, సినిమాల్లో చూసే మోడల్స్ అందరూ ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని మనం భావిస్తుంటాం. వారికి కూడా అందరిలానే తినాలని, తిరగాలని ఉంటుంది. కానీ వారు చేసే వృత్తి రీత్యా తప్పనిసరిగా ఆహార నిమయాలు పాటించాల్సివుంటుంది. ఒక్కోసారి ఎంతో ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సివస్తుంది. సెలెబ్రిటీల జీవితంఅందరూ అనుకునేట్లుగా ఆనందమయంగా ఉండదు. కాకపోతే వాళ్లు నియమానుసారం ఆహారం తీసుకుంటుంటారు. మనం కూడా వారు చూపిన మార్గంలో ఆరోగ్య సూత్రాలు మన ఆరోగ్యం కోసం పాటించాలి.
ఇదండీ మోడళ్ల ఆరోగ్య రహస్యం. మనం కూడా వాటిని పాటిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఈరోజు పాటిస్తే అందం, ఆనందం మన సొంతమవుతుంది. ఓకేనా...?

Comments
Post a Comment