వంటింటి చిట్కాలు
కాలీప్లవర్ కి పురుగుల బెడద హెచ్చు. ముక్కలు కోసి వేడినీళ్ళలో 2 నిముషాలు ఉంచితే పురుగులు చచ్చి పైకి తేలిపోతాయి లేదా గిన్నెనీటిలో కొంచెం వెనిగార్న్ కలిపి ముక్కలను వేసినా పురుగులు పైక వచ్చేస్తాయి.నిమ్మకాయలు ప్రిజ్లో ఉంచి నిలువ పెట్టే కన్నా వాటిని ఒక పాత్రలో కొంచెం చల్లని నీరు పోసి దాచి ఉంచితే వడలిపోవు ఐతే పాత్రలో నీరు మాత్రం రోజూ మారుస్తూ ఉండాలి.
అరటి కాయలు వంకాయలు కోసిన కాసేపటికే రంగు మారి కసరుగా మారతాయి. అయితే కోసిన వెంటనే కొంచెం మజ్జిగ కలిపిన నీటిలో వేసి ఉంచితే ముక్కలు అలా కాకుండా ఉంటాయి.
Comments
Post a Comment