మాంసం 1 1/2 kg ,బాస్మతీ బియ్యం 1 kg ,ఉల్లిపాయలు 1/4 kg ,పెరుగు 1/4 kg ,అల్లం వెల్లుల్లి ముద్ద 3 tsp , కొత్తిమిర 1/2 కప్పు ,పుదీన 1/2 కప్పు ,పచ్చిమిర్చి 3 ,పసుపు 1/4 tsp ,కారం పొడి 1 tsp ,ఏలకులు 6 ,లవంగాలు 10 , దాల్చిన 2" ముక్క ,షాజీర 2 tsp ,గరం మసాలా పొడి 1 tsp ,కేసర్ రంగు లేదా కుంకుమ పువ్వు ,పాలు 1 కప్పు , ఉప్పు తగినంత ,నూనె రెందు కప్పులు ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా కరకరలాడేటత్తుగా వేయించి పెట్టుకోవాలి.అలాగే తరిగిన కొత్తిమిర ,పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన ఉల్లిపాయ,కొత్తిమిర,పుదీనా,పెరుగు,కారంపొడి, పసుపు,మాంసానికి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో మెత్తగా ముద్ద చేసుకోవాలి.ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం,నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర,పుదీనా, పచ్చిమిరపకాయలు,గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి. బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు. మందపాటి గిన్నె తీసుకొని 4 త్బ్స్ప్ నూనె(ఇంతకుముందు ఉల్లిపాయలు వేయించిందే) వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పెద్ద ...