Pages

Font Help

Any Font Problems Please install this font. Click Here

Wednesday, June 1, 2011

Health Tips for Women

బహిష్టు నొప్పి హోమియోథెరపీ

‘స్ర్తీలకు సంబంధించి కలిగే ఆరోగ్య సమస్యల్లో గర్భాశయానికి సంబంధించి చాలామంది బాధపడుతుంటారు. సర్వ సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో నెలసరి సమస్య ఒకటి. వీటితోపాటు అధికశాతం మంది స్ర్తీలు పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీనినే బహిష్టునొప్పి అంటారు. దీనికి హోమియోవైద్యంలో ఉన్న ఆధునిక వైద్య విధానం గురించి హోమియో వైద్య నిపుణురాలు డాక్టర్‌ శ్రీదేవి ఇలా వివరిస్తున్నారు...’


ఈ రోజుల్లో యుక్తవయస్సువారు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ ఎక్కువగా టెన్షన్‌ తీసుకోవడం వల్ల గర్భాశయంలోని హార్మోన్స్‌ సరైనక్రమంలో పనిచేయక గర్భాశయ సమస్యలకు దారితీస్తోంది. డిస్మనోరియా అన్ని వయస్సులోని వారు బాధపడే ప్రధాన సమస్య. ఎక్కువగా యుక్తవయసు అమ్మాయిలను విపరీతంగా బాధపెట్టే సమస్య. బహిష్టు నొప్పి వల్ల స్కూల్‌కు, కాలేజీలకు సెలవు పెట్టడం, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం, చికాకుగా ఉండడం, ఏ పనీ సరిగ్గా చేసుకోలేక నేటికీ చాలామంది స్ర్తీలు మౌనంగా భరిస్తూ ఓర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రతినెలా క్రమంతప్పకుండా వచ్చే బహిష్టునొప్పి నివారణకు ఔషధాలు సేవిస్తూ కూడా బహిష్టు సమయంలో నొప్పికి శాశ్వత పరిష్కారం లేదా ? అని వాపోతున్న స్ర్తీలూ ఉన్నారు. స్ర్తీలలో గర్భకోశ ముఖ్య రీప్రోడక్టివ్‌ ఆర్గాన్‌. ఇది 9సెంటీమీటర్ల పొడవు, 6.5 సెంటీమీటర్ల వెడల్పు, 3.5 సెంటీమీటర్ల మందం కలిగి పెల్విక్‌ బోన్‌లో అమర్చబడి ఉంటుంది. గర్భాశయంలో ఉండే లోపలి పొర కదలికలతో రక్తస్రావం గర్భాశయం నుంచి బయటికి వెలువడుతూ ఉంటుంది.

డిస్మనోరియా లక్షణాలు
డిస్మనోరియా మూడు రకాలుగా ఉంటుంది. కొంతమందిలో బహిష్టునొప్పి మూడు నుంచి ఐదురోజుల ముందునుంచే పొత్తి కడుపులో, నడుము భాగం లో నొప్పి మొదలవుతుంది. ఇది రుతుస్రావం మొదలైన తరువాత ఔషధాలు ఉపయోగించకపోయినా దానికదే తగ్గిపోతుంది. దీనిని కంజెస్టివ్‌ డిస్మనో రియా అంటారు.

కొంతమందిలో బహిష్టు మొదలైన మొదటి రోజు మాత్రమే ఒకటి, రెండు గంటలు, సగం రోజు వరకు నొప్పి ఉండి రుతుస్రావం సాఫీగా జరగడంతో తగ్గి పోతుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి ఎక్కువగా ఉండి పొట్ట బిగదీసినట్లు ఉంటుంది. అంతేకాకుండా నొప్పి మరీ అధికంగా ఉన్నపుడు వాంతులు కావడం, శరీరం వణకడం, కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోవడం జర గవచ్చు.

ఈ రకమైన లక్షణాలు ఉన్న బహిష్టు యాభై శాతం స్ర్తీలలో చూస్తుంటాం. దీనినే ‘స్పాస్‌మోడిక్‌ డిస్మనోరియా’ అంటారు. ఇలాంటి లోపాలకు కారణం తెలుసుకుని వైద్య సహాయం పొందాలి.కొంతమందిలో నొప్పి విపరీతంగా ఉండి స్రావంలో పెద్దగడ్డలు ఉంటాయి. దీనినే ‘మెంబ్రౌనస్‌ డిస్మనోరియా’ అంటారు.

బహిష్టు నొప్పి ఎందుకు వస్తుంది ?
గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు, ఇతరత్రా వ్యాధుల కారణంగా సరైన సంకోచవ్యాకోచాలు జరగకపోవడం కారణంగా రుతుస్రావం కష్టంగా ఉండి బహిష్టు సమయంలో నొప్పి విపరీతంగా ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం చిన్నదిగా ఉండడం, ముడుచుకుని ఉండడం వల్ల స్రావం సాఫీగా జరుగక నొప్పి కలిగిస్తుంది.

కొంతమందిలో యోని ముఖద్వారం చిన్నదిగా ఉండడం వల్ల స్రావం సరిగ్గా బయటకు రాక, చిన్నగడ్డల రూపంలో కష్టంగా రుతుస్రావం వెలువడి నొప్పికి గురిచేస్తుంది. గర్భాశయం ఆకృతిలోనూ, పరిమాణంలోనూ ఉండే తేడాల వల్ల బహిష్టునొప్పి వస్తుంది. గర్భాశయస్థానం నుంచి వెనుకకు తిరిగి ఉండడం వల్ల కూడా బహిష్టునొప్పి వస్తుంది. గర్భాశయంలో గడ్డలు, చీము చేరడం, అండాశయంలో కంతులు పెరగడం మొదలైనవి కూడా బహిష్టు నొప్పికి ప్రధాన కారణాలే. గర్భనిరోధక ఔషధాల సేవనం, గర్భ నిరోధక పద్ధతులను పాటించడం, మానసిక ఆందోళనలు, భయాల వల్ల, హార్మోన్‌ ఇన్‌ బాలన్స్‌ జరిగి బహిష్టు నొప్పికి కారణమవుతాయి.

చికిత్స
గర్భాశయ సమస్యలను శాశ్వతంగా తగ్గించుకుని, తమతమ నిత్యఅవసరాలను, కార్యక్రమాలను ప్రశాంతంగా చేసుకునే అవకాశం హోమియో చికిత్స ద్వారా పొం దవచ్చు. ఇప్పుడు గర్భాశయ సమస్య లకు హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌లో ఒక ప్రత్యేక విభాగం ఏర్పరచి ప్రత్యేక లేడీడాక్టర్లతో రోగియొక్క శారీరక, మానసిక సమస్యలను పరిశోధించి జర్మనీ దేశపు ఔషధాలతో మంచి చికిత్స ఇస్తున్నారు.

హోమియో చికిత్స

బెలడోన:
బెలడోనలో ఆట్రోపిస్‌ అనే పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలోని రక్తకణాల మీద, నరాల మీద ప్రభావాన్ని చూపుతుంది. విపరీతమైన నొప్పులు ఉండి సడన్‌గా వచ్చి, కొంత సేపు ఉండి మళ్లీ సడన్‌గా వెళ్లడం దీని ముఖ్య లక్షణం. విపరీతమైన పొత్తికడుపునొప్పి ఉండి, గర్భాశయం గోడలు కందిపోయినట్లు ఉంటాయి. రుతుస్రావం ఎక్కువగా, వేడిగా ఉండి వాసన ఉంటుంది. తేలికపాటి కదలికతో నొప్పి ఎక్కువ అవ్వడం ముఖ్య లక్షణం.

యంగ్‌-ఫాస్‌ (మెగ్నిషియ ఫాస్మరికమ్‌) ః
బహిష్టునొప్పికి ఇది అద్భుతమైన ఔషధం. కండరాల మీద, నరాలపై ప్రభావం ఎక్కువగా ఉండి నొప్పి బిగేసినట్లుగా ఉంటుంది. నొప్పి వేడివల్ల, ప్రెషర్‌ వల్ల ఉపశమనం ఇస్తుంది. మెంబ్రౌనస్‌ డిస్మనోరియాకు మంచి ఔషధం.

కీలోసింథ్‌:
కీలోసింథ్‌ కండరాల మీద ప్రభావం చూపిస్తుంది. నొప్పి విపరీతంగా ఉండి, గర్భాశయం సెన్సిటివ్‌గా ఉంటుంది. నొప్పి వచ్చినపుడు నొప్పి ఉన్నచోట చేతులతో పట్టుకుని వంగడం వల్ల ఉపశమనం ఇస్తుంది. ఇలాంటి లక్షణాలకు కీలోసింథ్‌ మంచి ఔషధం.

సిమిసిఫ్యూగో:
ప్రభావం ఎక్కువగా కండరాలు, గర్భాశయం, అండాలమీద ఉంటుంది. బహిష్టు నొప్పి కరెంట్‌షాక్‌ కొట్టినట్లుగా ఉండి, నొప్పి తొడలకు పాకుతూ రుతుస్రావం ఎక్కువగా అవుతూ నొప్పి ఎక్కువగా ఉండడం ముఖ్య లక్షణం.

కంజెస్టివ్‌ డిస్మనోరియా
ఈ నొప్పి ముఖ్యంగా పెల్విక్‌ ఆర్గాన్‌ పాథాలజీ ఉన్న వాళ్లకు ఎక్కువగా వస్తుంది. ఎండో మెట్రియాసిస్‌, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేషన్‌, ఫైబ్రాయిడ్‌ కంతులు, అడినోమైంసిన్‌, పీసీఓడీ (అండాలకు వచ్చే తిత్తులు), సియు-టి వేయించుకున్న వారికి ఈ నొప్పి ఎక్కువగా ఉండి స్రావంఎక్కువగా ఉంటుంది.

గర్భనిరోధక సాధనాల వల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ నొప్పి టీనేజ్‌ (20 సంవత్సరాలు) అమ్మాయిలలో, 40 సంవత్సరాల వయసు వారిలో కూడా ఉంటుంది. కంజెస్టివ్‌ డిస్మనోరియాకు హోమియో చికిత్సలో కొన్ని మందులు యుటిరస్‌ మీద పనిచేసి వాటి ప్రభావంతో నొప్పి తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా టీనేజ్‌ అమ్మాయిలలో పిసిఓడి సమస్యలు ఎక్కువగా చూస్తుం టాం. దీనివల్ల వచ్చే కడుపునొప్పి, స్రావంలో ఉన్న తేడాను హోమియో కాన్‌స్టిట్యూషనల్‌ మెడిసన్స్‌తో చికిత్స చేయవచ్చు.

No comments:

Post a Comment