Pages

Font Help

Any Font Problems Please install this font. Click Here

Friday, February 4, 2011

Tips

  •  పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాలో రెండు లవంగాలు ఉంచండి.
  •  పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే అందులో కొబ్బరిముక్కను వేయాలి.
  • బంగారం చిలుము వదలాలంటే బ్రష్‌మీద పేస్ట్‌ వేసి బంగారు  ఆభరణాలపై రుద్దాలి.
  • పచ్చిమిరపకాయలు ఎక్కువగా కొన్నప్పుడు వాటి తొడిమలు తీసి ఫ్రిజ్‌లో ఒక కవర్‌లో ఉంచితే ఎక్కువరోజులు నిలవ ఉంటాయి.
  •  కొత్తిమీర, కరేపాకు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలాగాక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మొత్తగా పేస్ట్‌మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పును జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే...మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిలవవుంటాయి.
  • అల్లం, పచ్చిమిరపకాయలను కూడా అలాగే మొత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి, ఉప్పుకలిపి నిలవవుంచుకోవచ్చు.
  • పప్పు త్వరగా ఉడకాలంటే ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నూనెగానీ, డాల్డాగానీ వేసుకుంటే రుచికూడా బాగుంటుంది. త్వరగా ఉడికిపోతుంది.
  • నిమ్మకాయలు పిండేశాక ఆ తొక్కలను వెంటనే పారేయకుండా కుక్కర్‌ అడుగున నిలవవుండే నీళ్లల్లో వేసేసుకోవాలి. ఉడికేటప్పుడు చెడు వాసన రాకుండా ఉంటుంది.
  • వాడిపారేసిన టీ డికాషన్‌ లేదా టీ పొడిని పారేయకుండా వాటిని కుండీలలో వేస్తే చక్కని ఎరువులా మొక్కలకు ఉపయోగపడుతుంది. మొ క్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

No comments:

Post a Comment