Pages

Font Help

Any Font Problems Please install this font. Click Here

Monday, April 25, 2011

Menstrual Tips

రుతుక్రమం ప్రారంభమైననాటినుంచి ప్రతి నెలా మహిళలందరికీ ఇదో తప్పనిసరి దశ.అందరికీ అదో సాధారణ అంశం. కానీ కొందరికి మాత్రం అదో శాపం, ప్రవర్తనను సంపూర్ణంగా మార్చివేసి ‘అసలు ఆమేనా ఈమె’ అనుకునేలాంటి అభిప్రాయాన్ని కలిగించే దుస్థితి ఇది అందరిలోనూ కాకపోయినా..... ఆ కొందరుమాత్రం ఇంటిల్లిపాదినీ బాధిస్తారు. కాసింతసేపు వేధిస్తారు. తీవ్రతల్లో తేడా ఉండవచ్చేమోగానీ.... దాదాపు 80 శాతం మహిళల్లో ఎంతో కొంతమేర ఈ రుగ్మతతో బాధపడేవారే. అలా నెలసరికి ఐదు నుంచి ఏడురోజుల ముందు కొందరు మహిళలలో చోటు చేసుకునే మార్పులకు కారణమే... ‘పీ.ఎం.ఎస్‌.’ 
ఏమిటీ సిండ్రోమ్‌........?
తుఫాను ముందర కమ్ముకునే మబ్బుల్లా కొందరు మహిళల్లో పీరియడ్స్‌కి ముందు చోటుచేసుకునే లక్షణాలనే ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌. స్ర్తీలలో రుతు క్రమం మొదలైనప్పటినుంచి మెనోపాజ్‌ దశ వరకు ఈ క్షణాలు కోనసాగుతాయి. ఈ సిండ్రోమ్‌ శారీరక, మానసిక భావోద్వేగాల మయం. అంతకు ముందెన్నడూ లేని విధంగా కొంతమంది మహిళలు తమ స్వభావాలకు విరుద్ధంగా, విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఇదే.
వైరుధ్యం... విచిత్రం... వైపరీత్యం...
ఈ సిండ్రోమ్‌ లక్షణాలు అందరు స్ర్తీలలో ఒకే విధంగా ఉండవు. కొంతమందిలో శారీరీకమైన రుగ్మతలు ఎక్కువ గా ఉంటాయి. మరికొందరిలో మానసిక, శారీరకమైన ఇబ్బందులు రెండూ ఉంటాయి. కొంతమంది మహిళలకు మాత్రం ఇటువంటి లక్షణాలేవీ కనపడకుండానే నెలసరి మామూలు రోజులలాగే సాఫీగా గడిచిపోతుంది.

ఈ విషయంలో వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు సాధరణంగా రుతుస్రావం మొదలైన తరువాత ఉండవు. కానీ విచిత్రంగా మరికొంతమందిలో మాత్రం రుతుస్రావం జరిగే రోజులలో కూడా ఈ లక్షణాలు కొనసాగవచ్చు - మామూలు ఇబ్బందైతే పర్లేదు..... కానీ ఈ లక్షణాలు చాలా తీవ్రస్థాయిలో ఉండి దైనందిన జీవనంలో అనేక ఆటంకాలకు కారణమవుతుంటే దానిని ‘ప్రీ మెన్‌స్ట్రువల్‌ డిస్‌ ఫోరిక్‌ డిసార్డర్‌- పిఎడిడీ’ అంటారు.

ఇలాంటివారు తప్పనిసరిగా వైద్యసహాయం తీసుకోవాలి. కుటుంబానికి చెందిన వారెవరికైనా ఇలాంటి రుగ్మత ఉంటే ఆ కుంటుంబంలోని మిగతా మహిళలూ పి.ఎం.ఎస్‌ బారిన పడే అవకాశం ఎక్కువ. ఈ సిండ్రోమ్‌ పీడితులు అవునో, కాదో తెలుసుకోవాలనుకుంటే ఎవరికి వారే ఓ పరీక్ష చేసుకోవచ్చు. కనీసం రెండు రుతు్రమాలు వచ్చే ముందూ, వచ్చిన తరువాత మీ ప్రవర్తనను క్రింద ఇచ్చిన లక్షణాలతో సరిచూసుకోండి. 
శారీరక మార్పులు....
*రుతుక్రమ సమయంలో ఆకలి మందగించడం.
*తలనొప్ప, కాళ్ళు, చేతులపై చెమటలు పట్టడం.
*పొత్తి కడుపు, నడుము నొప్పి.
*రొమ్ముల్లో సలుపు (బ్రెస్ట్‌ టెండర్‌నెస్‌). 
మానసిక మార్పులు...
*చికాకు, నిస్పృహ, ఆత్రుత, అస్పష్ఠత, కంగారు.
*తీవ్రమైనఒత్తిడికిలోనుకావడం.
*ఒంటరిగా ఉండాలనుకోవడం.
*ఏ పని చేయాలనిపించకపోవడం.
నిజానికి ఆ సమయంలో శారీరకంగా కలిగే సమస్యల కంటే మానసిక ఉద్వేగాలతో వచ్చే సమస్యలే మహిళ లను ఎక్కువగా బాధిస్తాయి. 
చేయాల్సిందిదే.....
ఈ సమయలో నడుంనొప్పి, కడుపునొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్స్‌ వేేసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు ఈ క్రింది జాగ్రత్తలను కూడా పాటిస్తే మరికొంత మేలు చేకూరుతుంది.
*ఆహారపు అలవాట్లలో, జీవనశైలిలో కాస్తమార్పు చేసుకుంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటుంది.
*పాలూ, పాలతో తయారయ్యే ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
*అలాగే.... కొవ్వు పదార్థాలు తక్కుగా ఉండే ఆహారం తీసుకోవడాం కూడా అవసరం.
*కాఫీ, టీ, చక్కెర, ఉప్పు వంటివి తగ్గించాలి.
*పీచూపదార్థాలు, ప్రోటీన్లు (పప్పుధాన్యాలు) ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
*కాల్షియం, విటమిన్‌ - ఇ టాబ్లెట్లు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే వీటిని విధిగా డాక్టర్‌ సలహా మేరకే వాడాలి. తీసుకోవాల్సిన మోతాదు కూడా డాక్టరే నిర్ణయిస్తారు.
మరికొన్ని మార్గాలు...
మందులతో మాత్రమేకాకుండా అందరూ వివిధ రకాలైన వ్యాయామంతోనూ ఈ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. వీలైనంత వరకు లైట్‌ ఏరోబిక్‌ ఎక్స్‌ర్‌ సైజ్‌లు చేయడం వల్ల కొంత సాంత్వన చేకూరుతుంది. కోపం, విసుగు, చికాకు కలిగించే వాతావరణానికి దూరంగా ఉండాలి. మంచి సంగీతం వినడం, అభి రుచులకు తగిన పనులు చేయడం వల్ల చికాకు తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. నెలలో మిగిలిన రోజులలో కూడా ఆహారపు అలవాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అయితే సమస్య తీవ్రంగా ఉందంటే మాత్రం...... ఈ సిండ్రోమ్‌తో బాధపడుతూ, చుట్టూ ఉన్న వారిని బాదపెడుతూ ఉండటం కంటే డాక్టర్‌ని సంప్రరించడం మంచిది. అందు బాటులో చికిత్స ఉన్నప్పుడు అనవసరంగా బాధలు అనుభవించడం సరికాదు కదా.

పి.ఎం.ఎస్‌ లక్షణాలు ఉంటే వాటిని నియంత్రించు కోవడం ప్రతి మహిళకు సాధ్యంకాకపోవచ్చు. ఆ లక్షణాల తీవ్రతనుబట్టే ఆమె ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అలాంటంప్పుడు ఆమెకు కావల్సింది ఆమెను అర్థం చేసుకునే మనసు. అండగా నిలిచే కుంటుంబ సభ్యుల ఆలంబన. అందుే... ఆమె చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రశాంతంగా సంతోషంగా ఉంచగలిగితే ఆమెకు కొంత ఊరటని అందించిన వారవుతారు. అంతేకాదు... వీలయినంత వరకు ఆ సమయంలో ఇంటి పనులలో మిగతా కుటుంబ సభ్యుల సాయం అందితే శారీరకంగా ఆమె శ్రమ చాలా వరుకు తగ్గుతుంది. ఇక ఉద్యోగం చేసే మహిళలకు ఆసమయం నరకమే.

వీక్‌లీ ఆఫ్‌ బదులు ఆ మూడు రోజులు మంత్‌లీ ఆఫ్‌లు ఉంటే బాగుండు అనుకోవడం కొందరిలో మామూలే. బస్సులో ప్రయాణం చేసి, ఆఫీస్‌లో అన్ని గంటలు పనిచేసి వచ్చిన మహిళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యులదే. ఇవన్నీ సహజంగా జరిగే మార్పులే. అయితేనేం... వాటి వెనుక కారణం రుతుక్రమమే అనే విషయం ఆమె మరిచిపోయే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆ సమయంలో కుటుంబ సభ్యులు సరైన తోడ్పాటును ఆందించగలిగితే మహిళలు మానసికంగా కొంత స్థిమితపడతారు.

No comments:

Post a Comment