ఇల్లే వైకుంఠం అనుకుంటూ కొందరు పొద్దస్తమానం వంటింట్లోనే కాలక్షేపం చేస్తుంటారు. కొద్దిగా పెద్ద కుటుంబం అయితే సరేసరి...ఉదయం లేచిన దగ్గరనుంచి టిఫిన్స్ ఏం చేయాలా? భోజనంలో కూరలు ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు. అటువంటివారి కోసం కొన్ని వంటింటి చిట్కాలు రెడీగా ఉన్నాయి. వీటిని పాటిస్తే వంటింట్లో ఎడతెగకుండా సమస్యలుగా ఉండేవాటికి కొంత పరిష్కారం లభించినట్లే... అవేమిటో ఇప్పుడు చూద్దాం రండి...
- నూనె తక్కువ వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తక్కువ వేసినా కూర రుచిగా ఉండాలంటే ఈ విధంగా చేసి చూడండి. బాణాలి లేదా గిన్నె బాగా వేడెక్కిన తరువాత నూనె వేసినట్టయితే తక్కువ నూనెతో కూడా వేపుడు కూరలు చేసుకోవచ్చు.
- గారెల పిండిలో కొద్దిగా సేమ్యా వేయించి కలిపితే మంచి రుచిగా ఉంటాయి. తినేటప్పుడు గారెలు కరకరలాడుతూ అచ్చంగా హోటల్లో తిన్నట్లే ఉంటాయి.
- గారెల పిండి రుబ్బిన వెంటనే నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచి తీసిన తరువాత గారెలు వండితే నూనె పీల్చకుండా ఉం టాయి. పెద్దవారికి కొలెస్ట్రల్ భయం ఉండదు.
- ఉప్పు వేసిన నీటిలో కూరగాయముక్కలను కొద్ది సేపు ఉంచి ఆ తరు వాత వాటిని ఉడకబెడితే త్వరగా ఉడుకుతాయి.
- ఎండాకాలం పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. పాలు కాచేటప్పుడు రెండు మూడు వడ్ల గింజలు వేసి కా చి, ఆ తరువాత వాటిని తీసేయండి. లేదా ముందుగానే తినే సోడాను చిటికెడు పాలల్లో వేసి కాగపెట్టాలి.
- ఎండు కొబ్బరి, నువ్వులు,ధనియాలు కలిపి పొడి చేసుకొని కూరలలో వేస్తే మంచి రుచి వస్తుంది. ఈ పొడి చాలా రోజుల వరకూ నిల్వ వుంటుంది.
- చపాతీలు మరింత రుచిగా కావాలనుకుంటే ఈ విధంగా చేసి చూడండి. గోధుమపిండిలో కొద్దిగా బార్లీపిండి, శనగపిం డి కలిపితే మంచి రుచిగా ఉంటాయి.
- ఎండు కొబ్బరిని సులభంగా తురుమాలంటే ఈ విధంగా చేసి చూడండి. ఎండుకొబ్బరిని కొద్ది సేపు ఫ్రిజ్లో పెట్టి ఆ తరువాత తురుమాలి.
- వేరుశనగపప్పు లడ్డు చేసేటప్పుడు బెల్లంతో పాటు కొద్దిగా చక్కెర కలిపితే ఎంతకాలమైనా లడ్డు తాజాగా ఉంటుంది.
- పాలు కాగేటప్పుడు చిల్లుల మూత లేదా గిన్నెను పెడితే మీగడ బాగా కడుతుంది.
- బొబ్బట్లు (భక్ష్యాలు) చేసేటప్పుడు తోపులో కొద్దిగా గోధుమ రవ్వ కలిపితే బొబ్బట్లు చిరగకుండా వస్తాయి.
Comments
Post a Comment