Pages

Font Help

Any Font Problems Please install this font. Click Here

Wednesday, April 20, 2011

Diet During Pregnancy

తల్లీబిడ్డల...పోషకాహారం
బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని కూడా తెలుసు. గర్భిణులు ఐరన్‌ మాత్రలు తీసుకునేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటిస్‌ వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిపాలల్లో ఉండే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలో ఉండవన్నది నగ్నసత్యం...

మన భారతీయుల్లో స్థూలకాయం, షుగర్‌ చాలా ఎక్కువ. నలభైలు దాటీ దాటక ముందే అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇంత చిన్న వయసులో ఉన్న వారికి కూడా చక్కెర వ్యాధి వచ్చే ధోరణి మొదలైంది. ఇప్పటివరకూ స్థూలకాయం, చక్కెర వ్యాధులకు శారీరక వ్యాయామం లేకపోవడం, తిండి అలవాట్లు, ఒత్తిడి కారణమని వైద్యులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. పుణెలోని కింగ్‌ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ హాస్పటల్‌ డయాబెటీస్‌ యూనిట్‌ డయాబెటీస్‌ పేషంట్ల సంఖ్య పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తూ అధ్యయనాలు చేసినప్పుడు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న కారణాల కంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయని గుర్తించింది. బ్రిటన్‌లో ఉన్న చక్కెర వ్యాధిగ్రస్థుడితో పోల్చి చూస్తే మన వాళ్ళలో చక్కెరవ్యాధి బారిన పడినవారు తక్కువ బరువుతోనే ఉన్నారు. కానీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. కండపుష్ఠి లేకపోవడమే దీనికి కారణం.

మన వాళ్ళకి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే లణం ఎక్కువ. కాలేయం కొవ్వులో మునిగితేలుతుంది. ఈ కొవ్వు జీవక్రియలు జరిగే తీరు మీద ప్రభావం చూపిస్తుంది. ఇన్సులిన్‌ని శరీరకణజాలం మీద సరిగా పనిచేయనీయకుండా చేస్తుంది.దీనివల్లే భారతీయులు డయాబెటిస్‌,దానికి సంబంధించిన ఇతర డిసార్డర్స్‌కి గురయ్యేది.తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఇలా కొవ్వు పేరుకుపోయే క్షణం ఎక్కువగా ఉండి,పెద్దయ్యాక డయా బెటిస్‌కి,గుండె జబ్బులకు గురవుతారని ప్రొఫెసర్‌ డేవిడ్‌ బర్కర్‌ ప్రతిపాదిస్తున్నారు.


పొట్టలో పిండంగా ఉన్నప్పుడే తగిన ఆహారం అందకపోవడం వల్ల బయటి ప్రపంచాన్ని కరువుతో కూడుకున్నదానిగా చూేసే లక్షణం బిడ్డ శరీరానికి వస్తుందని,కాబట్టి దొరికినప్పుడు వీలైనంత ఆహారాన్ని గ్రహించి దాన్ని కొవ్వు రూపంలో నిల్వ చేసుకోవడానికి అలవాటుపడుతుందని అయన ఆంటున్నారు. ఆ వ్యక్తులు మధ్యతరగతి, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు శరీరం తీవ్రంగా స్పందిస్తుంది. ఇది హార్మోన్ల వ్యవస్థ, జీవక్రియల వ్యవస్థల పనితీరుని మందగింపచేసి మనిషిని టైప్‌ -2 డయాబిటిస్‌ వైపుకు నెడుతుంది.... ఇదీ డేవిడ్‌ బార్కర్‌ వివరణ.

ఇది మన దేశ ప్రజలకు వర్తించే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మన పిల్లలు పుట్టినప్పుడు ఉండే బరువు అనేక దేశాల పిల్లల బరువుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది, మన పెద్ద వాళ్ళలోనే కాకుండా పుడుతున్న పిల్లల్లో కూడా కండపుష్ఠి తక్కువ. కొవ్వు ఎక్కుగా ఉంటున్నవారు ఎక్కువగానే ఉన్నారు. అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచి శరీరం కొవ్వు నిల్వ చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతోందన్న మాట.

మన శిశువుల శరీర కొలతల్ని చూస్తే వాళ్ళ శరీరం ఇన్సులిన్‌ నిరోధకంగా తయారయ్యే అవకాశం ఎక్కువ ఉందనిపిస్తుంది. పుణె. ఢిల్లీలలో చేసిన ఆధ్యయనాల్లో పుట్టినప్పుడు బరువు తక్కువ ఉండి బాల్యంలో పెరుగుదల వేగంగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక టైప్‌ -2 డయాబెటీస్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువ అని తెలుస్తుంది. బలహీనంగా పుట్టిన పిల్లల బరువును పెంచడానికి తల్లి దండ్రులు, డాక్టర్లు ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

వీటి ఫలితాలు ఎలా ఉంటాయో మరి,గర్బిణులుగా ఉన్నవారిలో కొన్ని బీ విటమిన్లు తగ్గినా కండ తక్కువ కొవ్వు ఎక్కువ ఉండే పిల్లలు పుట్టవచ్చని పుణెలో చేసిన ఇటివల పరిశోధనలు తెలుపుతున్నాయి. భావితరాల ఆరోగ్యం కోసం ఆడపిల్లలు ఎలాంటి తిండి తినాలో తెలిపే సూచనలను త్వరలోనే చేయనున్నామని పరిశోధనలు చేసిన డాక్టర్‌ తెలియజేస్తున్నారు. తల్లులు ఆరోగ్యం మీదనే భావితరాల ఆరోగ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా టైప్‌ -2 డయాబెటిస్‌ నుంచి భావితరాల్ని విముక్తం చేయాలంటే ఇప్పటి యువతులకు ఆరోగ్యకరమైన ఆహారం ఆందాలి.మధ్య తరగతి..... ఆ పై తరగతికి ఈ విషయాలు తెలియజేసే బాధ్యత, దిగువ తరగతుల యువతలకు పోషకాహారం అందే మార్గాలు అన్వేషించే బాధ్యత విదానాలు రూపొందించే వారి మీదే ఉంది. ఈ పరిశోధనలు వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాల్సిందే.

No comments:

Post a Comment